🏠 www.hindusthanmedia.com
Watermark
Newspaper Logo
www.hindusthanmedia.com | Date: 01 Aug, 2026 | Page: 1

సూక్ష్మ కళా రూపాలతో ఆకట్టుకున్న జక్కనపల్లి రాము


కేజీబీవీ లో ప్రత్యేక కళా ప్రదర్శన
హిందుస్థాన్ మీడియా, చిన్నకోడూరు: సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అల్లిపూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)**లో నిర్వహించిన కళా ప్రదర్శన కార్యక్రమంలో చేర్యాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు జక్కనపల్లి రాము తన వినూత్న కళాఖండాలతో విద్యార్థులను ఆకట్టుకున్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం. శారద ఆహ్వానం మేరకు నిర్వహించిన ఈ ప్రదర్శనలో సుద్ద ముక్కలతో రూపొందించిన సూక్ష్మ కళారూపాలను జక్కనపల్లి రాము ప్రదర్శించారు. ఈ అరుదైన కళాఖండాలను విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు ఎం. శారద మాట్లాడుతూ, ఇలాంటి కళా ప్రదర్శనలు విద్యార్థుల్లో సృజనాత్మకత, ఏకాగ్రత, క్రమశిక్షణ, సమయపాలన, కళా నైపుణ్యాలను పెంపొందించేందుకు ఎంతో దోహదపడతాయని అన్నారు.
సూక్ష్మ కళాకారుడు జక్కనపల్లి రాము మాట్లాడుతూ, తన కళను ప్రోత్సహిస్తూ ఆదరిస్తున్న విద్యాసంస్థలు, కళాభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు ఇ. శ్రీవాణి, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొని కళా ప్రదర్శనను ఆసక్తిగా వీక్షించారు.
🏠 Home