🏠 www.hindusthanmedia.com
Watermark
Newspaper Logo
www.hindusthanmedia.com | Date: 05 Aug, 2026 | Page: 1

సైబర్ మోసానికి గురైతే వెంటనే పోలీసులను ఆశ్రయించాలి : చేర్యాల సీఐ రమేష్ నాయక్

​చేర్యాల (హిందూస్థాన్ మీడియా):
*​అపరిచితులకు ఓటీపీలు చెప్పొద్దు*
​సైబర్ నేరాల పట్ల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉంటేనే మోసాల నుంచి పూర్తి రక్షణ పొందవచ్చని చేర్యాల సీఐ బానోతు రమేష్ నాయక్ స్పష్టం చేశారు. తెలంగాణ పోలీస్ శాఖ చేపట్టిన 'సురక్షా తిరంగా సైబర్' కార్యక్రమంలో భాగంగా బుధవారం (ఆగస్టు 05) చేర్యాల పట్టణ ప్రధాన రహదారిపై కళాశాలల విద్యార్థులతో కలిసి భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
*​వాసవి గార్డెన్స్‌లో సైబర్ అవగాహన సభ*
​ర్యాలీ అనంతరం పట్టణంలోని వాసవి గార్డెన్స్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సైబర్ నేరాలు జరుగుతున్న తీరుపై విద్యార్థులకు, స్థానికులకు సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ బానోతు రమేష్ నాయక్ మాట్లాడారు. అపరిచితుల నుంచి వచ్చే ఫేక్ కాల్స్, లింకులను నమ్మవద్దని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంకు ఓటీపీ (OTP)లు, ఖాతా వివరాలు, పిన్ నంబర్లు మరియు వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు. సైబర్ క్రిమినల్స్ కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారని, సైబర్ భద్రతా నియమాలు పాటించడమే శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా అజాగ్రత్త వల్ల సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 జాతీయ సైబర్ హెల్ప్‌లైన్‌కు గానీ లేదా స్థానిక పోలీసులను గానీ ఆశ్రయించి ఫిర్యాదు చేయాలని కోరారు.
​ఈ ​అవగాహన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పోటీల్లో చురుగ్గా పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పోలీస్ అధికారులు జ్ఞాపికలను (మోమెంటోలు) అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో చేర్యాల సీఐ బానోత్ రమేష్ నాయక్, చేర్యాల ఎస్‌ఐ అపూర్వ రెడ్డి, కొమురవెల్లి ఎస్ఐ మహేష్, మద్దూర్ ఎస్ఐ ఆసిఫ్, పోలీస్ సిబ్బందితో పాటు శ్రీ వింధ్యా, గౌతమి, సుమిత్రా కాలేజీల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు
🏠 Home