🏠 www.hindusthanmedia.com
Watermark
Newspaper Logo
www.hindusthanmedia.com | Date: 15 Aug, 2026 | Page: 1

ఇల్లంతకుంట తహసీల్దార్ సురేష్‌కు ప్రశంసాపత్రం

హిందుస్థాన్ మీడియా, ఇల్లంతకుంట: ఇల్లంతకుంట తహసీల్దార్ సురేష్ ఉత్తమ సేవలను గుర్తించి ప్రశంసాపత్రం అందజేశారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా శనివారం వేములవాడ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే చేతుల మీదుగా తహసీల్దార్ సురేష్ ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.
ప్రజలకు అంకితభావంతో సేవలు అందించడంతో పాటు విధుల నిర్వహణలో చూపిన సమర్థతను గుర్తించి ఈ ప్రశంసాపత్రాన్ని అందజేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ సురేష్‌ను పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, సహచరులు అభినందించారు.
🏠 Home