🏠 www.hindusthanmedia.com
Watermark
Newspaper Logo
www.hindusthanmedia.com | Date: 17 Aug, 2026 | Page: 1

మద్దూర్ ప్రజావాణి లో రెండు దరఖాస్తుల స్వీకరణ

దరఖాస్తులను పరిశీలించిన జడ్పీ సీఈఓ రమేష్
హిందుస్థాన్ మీడియా, మద్దూరు, ఆగస్టు 17: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని మద్దూరు మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి రెండు దరఖాస్తులు స్వీకరించినట్లు ఎంపీడీవో రామ్మోహన్ తెలిపారు.ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను సిద్దిపేట జిల్లా పరిషత్ సీఈఓ రమేష్ పరిశీలించినట్లు ఎంపీడీవో వెల్లడించారు. సంబంధిత సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
🏠 Home