🏠 www.hindusthanmedia.com
Watermark
Newspaper Logo
www.hindusthanmedia.com | Date: 21 Aug, 2026 | Page: 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నూతన ఎస్ఐల బాధ్యతల స్వీకరణ

నూతన ఎస్‌ఐలకు జిల్లా ఎస్పీ శుభాకాంక్షలు
హిందుస్థాన్ మీడియా, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో నూతనంగా నియమితులైన ఎస్‌ఐలు శుక్రవారం ఆయా పోలీస్ స్టేషన్లలో బాధ్యతలు స్వీకరించారు. తంగళ్లపల్లి ఎస్‌ఐగా అశోక్, ఇల్లంతకుంట ఎస్‌ఐగా ఉపేంద్ర చారి, వేములవాడ రూరల్ ఎస్‌ఐగా ప్రశాంత్ రెడ్డి, కొనరావుపేట ఎస్‌ఐగా రామ్మోహన్ బాధ్యతలు చేపట్టారు.అనంతరం నూతన ఎస్‌ఐలు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితేను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్‌ఐలకు శుభాకాంక్షలు తెలిపారు.శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేలా సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించి, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు.ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, తమ పరిధిలో శాంతిభద్రతలను సమర్థవంతంగా కాపాడాలని నూతన ఎస్‌ఐలకు సూచించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఎస్పీ ఆకాంక్షించారు.
🏠 Home