కొమురవెల్లి మల్లన్నకు కిలో వెండి బహుకరించిన రవి -లక్ష్మీ ప్రసన్న దంపతులు
వెండి పళ్లెం, శఠగోపం, పంచపాళి సమర్పించిన హైదరాబాద్ భక్తులు
హిందుస్థాన్ మీడియా, కొమురవెల్లి: సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారికి హైదరాబాద్‌కు చెందిన భక్తులు వెండి పూజా సామగ్రిని విరాళంగా సమర్పించారు.
హైదరాబాద్‌కు చెందిన బూర రవి గౌడ్–లక్ష్మీ ప్రసన్న దంపతులు మంగళవారం స్వామివారికి సుమారు కిలో బరువున్న వెండి పళ్లెం, వెండి శఠగోపం, వెండి పంచపాళి (నాలుగు పాత్రలు) తదితర పూజా సామగ్రిని భక్తిశ్రద్ధలతో సమర్పించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దంపతులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందించి సత్కరించారు. స్వామివారికి భక్తితో వెండి పూజా సామగ్రిని సమర్పించిన దంపతులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం సహాయ కార్యనిర్వహణ అధికారి బుద్ధి శ్రీనివాస్, ముఖ్య అర్చకులు యం. మనోహర్, సిబ్బంది ఎం. మధుకర్, డి. శంకర్ తదితరులు పాల్గొని దంపతులను అభినందించారు.