🏠 www.hindusthanmedia.com
Watermark
Newspaper Logo
www.hindusthanmedia.com | Date: 21 Sep, 2026 | Page: 1

సలాక్ర్ పూర్ పాఠశాల ప్రహరీ గోడకు భూమి పూజ

రూ.6 లక్షల ఉపాధి హామీ నిధులతో నిర్మాణ పనులకు శ్రీకారం
విద్యార్థుల భద్రతకు ప్రహరీ గోడ ఎంతో అవసరం: సర్పంచ్‌ గడపే మౌనిక అనిల్‌కుమార్‌
మద్దూరు, సెప్టెంబర్‌ 21, హిందుస్థాన్ మీడియా:
మండలంలోని సలాక్ పూర్‌ ప్రభుత్వ పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణ పనులకు సోమవారం భూమిపూజ నిర్వహించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌) నిధుల ద్వారా సుమారు రూ.6 లక్షల అంచనా వ్యయంతో ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టనున్నారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ గడపే మౌనిక అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ.. పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవడంతో విద్యార్థుల భద్రతతో పాటు పాఠశాల ఆవరణ పరిరక్షణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రహరీ గోడ నిర్మాణంతో పాఠశాల ఆవరణకు రక్షణ ఏర్పడటంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులకు సురక్షితమైన వాతావరణం కల్పించడమే గ్రామపంచాయతీ లక్ష్యమని పేర్కొన్నారు.
పాఠశాల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు గ్రామపంచాయతీ తరఫున సహకారం అందిస్తామని సర్పంచ్‌ తెలిపారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి, విద్యార్థులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందిని కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ శెట్టి ఐలయ్య, మాజీ సర్పంచ్‌ వంగ భాస్కర్‌రెడ్డి, వార్డు సభ్యులు నిర్మల, ప్రసాద్, యాదగిరి, చంద్రవ్వ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేష్మా, ఉపాధ్యాయుడు చంద్రయ్య, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్‌ చామంతుల దేవేంద్ర, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home