🏠 www.hindusthanmedia.com
Watermark
Newspaper Logo
www.hindusthanmedia.com | Date: 04 Oct, 2026 | Page: 1

మద్దూర్ మోడల్ స్కూల్లో స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్ట్ ఖాళీ

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
అక్టోబర్‌ 7లోగా దరఖాస్తు చేసుకోవాలి: ప్రిన్సిపాల్‌ కోట నరేందర్‌రెడ్డి
సిద్దిపేట జిల్లా, అక్టోబర్‌ 4, మద్దూరు, హిందుస్థాన్ మీడియా: పీఎం శ్రీ తెలంగాణ మోడల్‌ స్కూల్‌ అండ్‌ జూనియర్‌ కాలేజ్‌, మద్దూరులో స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ పోస్టు ఖాళీగా ఉన్నట్లు ప్రిన్సిపాల్‌ కోట నరేందర్‌రెడ్డి తెలిపారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు మెరుగైన విద్యా సహాయం, మార్గదర్శకత్వం అందించేందుకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు స్పెషల్‌ బీఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) పూర్తి చేసి ఉండాలి. లేదా జనరల్‌ బీఈడీతో పాటు స్పెషల్‌ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలని తెలిపారు.
అర్హత కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాల ప్రతులతో పాఠశాలకు హాజరై దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ సూచించారు.
🏠 Home