🏠 www.hindusthanmedia.com
Watermark
Newspaper Logo
www.hindusthanmedia.com | Date: 20 Oct, 2026 | Page: 1

మహిళల ఐక్యతతోనే పండుగలకు మరింత శోభ: శ్రీనివాస్ గౌడ్

పెద్ద అంబర్‌పేట, హిందుస్థాన్ మీడియా: పెద్ద అంబర్‌పేట పరిధిలోని జయప్రకాష్ నగర్ కాలనీలో సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీఎస్ సేవాసమితి చైర్మన్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ మహిళలు ఆటపాటలతో సందడి చేశారు.శ్రీనివాస్ గౌడ్ స్వయంగా మహిళలతో కలిసి కోలాటం ఆడుతూ, చప్పట్లు కొడుతూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఐకమత్యంతో పండుగలను జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. బతుకమ్మ వంటి పండుగలు ప్రజల మధ్య స్నేహభావాన్ని, ఆత్మీయతను పెంపొందించడంతో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు సముద్రాల సుధాకర్, లాల్ మహమ్మద్, చిన్న జహంగీర్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home