🏠 www.hindusthanmedia.com
Watermark
Newspaper Logo
www.hindusthanmedia.com | Date: 21 Oct, 2026 | Page: 1

మద్దూర్ లో పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులు

మద్దూరు, అక్టోబర్ 21, హిందుస్థాన్ మీడియా: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మద్దూరులోని పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద ఎస్‌ఐ ఎం.డి. ఆసిఫ్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు మౌనం పాటించి విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసుల త్యాగాలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా ఎస్‌ఐ ఆసిఫ్ మాట్లాడుతూ దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలు మరువలేనివని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో, సమాజంలో శాంతిని నెలకొల్పడంలో పోలీసులు అందిస్తున్న సేవలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home