🏠 www.hindusthanmedia.com
Watermark
Newspaper Logo
www.hindusthanmedia.com | Date: 22 Oct, 2026 | Page: 1

బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన యోధుడు పండగ సాయన్న : కొమ్మూరి

చేర్యాల, అక్టోబర్ 22, హిందుస్థాన్ మీడియా: పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలను గురువారం చేర్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాపరెడ్డి పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కొమ్మూరి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ జమీందార్లు, జాగీర్దార్లు, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి, నిరుపేదలు, అణగారిన వర్గాల హక్కుల కోసం నిలిచిన పోరాటయోధుడు పండుగ సాయన్న అని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటాలు స్ఫూర్తిదాయకమని అన్నారు. పండుగ సాయన్న ఆశయాలను భావితరాలకు తెలియజేస్తూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి, చేర్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మంజ మల్లేశం, కొమురవెల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస్, చేర్యాల పట్టణ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్, వైస్ చైర్మన్ బోయిని శ్రీనివాస్, జనగామ పట్టణ అధ్యక్షుడు వెంకటరెడ్డి, మద్దూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మారెళ్ల భాస్కర్ రెడ్డి, వివిధ మండలాల కాంగ్రెస్ నాయకులు, గ్రామ సర్పంచ్‌లు, మార్కెట్ కమిటీ సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొని నివాళులర్పించారు.
🏠 Home