🏠 www.hindusthanmedia.com
Watermark
Newspaper Logo
www.hindusthanmedia.com | Date: 24 Oct, 2026 | Page: 1

చేర్యాల 9వ వార్డు కాంగ్రెస్ అధ్యక్షుడి గా నర్ర మహేష్ ఎన్నిక!

చేర్యాల, అక్టోబర్ 24, హిందుస్థాన్ మీడియా: జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పిలుపు మేరకు చేర్యాల పట్టణంలో నూతన వార్డు కమిటీల ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్ ఆధ్వర్యంలో శనివారం 9వ వార్డు కమిటీని ఎన్నుకున్నారు.వార్డు అధ్యక్షుడిగా నర్ర మహేష్, ఉపాధ్యక్షులుగా బుడిగె కిషన్, నర్ర రమేష్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా ఉడుగుల లింగం, నర్ర కేశవులు, అల్లం రమేష్, బస్వరాజు కృష్ణ బాధ్యతలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో పూర్మ ఆగంరెడ్డి, ఆడెపు చంద్రయ్య, దాసరి కళావతి, పచ్చిమడ్ల వెంకటయ్య, ఎండీ ఖాజా, ఉట్లపల్లి శ్రీనివాస్, ఐత శ్రీనివాస్, బందెల మహిపాల్ రెడ్డి, కాటం శ్రీనివాస్, చింతల మల్లేశం, నీలం సన్నీ, తుమ్మలపల్లి సంతోష్, మల్లిగారి నర్సింలు, పచ్చిమడ్ల సత్యనారాయణ, అంబాల రాము, మామిడాల నాగరాజు, చెన్నిగారి బిక్షపతి, కొలిపాక వెంకటేష్, బుట్టి బిక్షపతి, గుడాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home