🏠 www.hindusthanmedia.com
Watermark
Newspaper Logo
www.hindusthanmedia.com | Date: 26 Oct, 2026 | Page: 1

ట్రాక్టర్ ఢీకొని వృద్ధురాలు మృతి!

చిన్నకోడూరు, హిందుస్థాన్ మీడియా: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చర్ల అంకిరెడ్డిపల్లి గ్రామంలో ట్రాక్టర్‌ ప్రమాదంలో ఓ వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. గ్రామానికి చెందిన వర్కోలు గౌరమ్మ (75), భర్త కిష్టయ్య, ట్రాక్టర్‌ రివర్స్‌ తీస్తున్న సమయంలో దాని కింద పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.కేశవేణి నారాయణకు చెందిన ట్రాక్టర్‌ను రివర్స్‌ తీస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిసింది. ప్రమాదంలో గౌరమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
🏠 Home