🏠 www.hindusthanmedia.com
Watermark
Newspaper Logo
www.hindusthanmedia.com | Date: 27 Oct, 2026 | Page: 1

జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌లో గోనెపల్లి విద్యార్థుల ప్రతిభ

లాంగ్‌జంప్‌లో పి. పూజితకు ప్రథమ స్థానం.. పలు విభాగాల్లో పతకాలు
చిన్నకోడూరు, హిందుస్థాన్ మీడియా: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనెపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులు జిల్లాస్థాయి ఎస్‌జీఎఫ్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు.అండర్‌–17 బాలికల విభాగంలో డి. పూజిత లాంగ్‌జంప్‌లో ప్రథమ స్థానం, హైజంప్‌లో ద్వితీయ స్థానం సాధించింది. ఇదే విభాగంలో టి. హృతిక 200 మీటర్ల పరుగు పందెంలో తృతీయ స్థానం దక్కించుకుంది. అండర్‌–14 బాలికల విభాగంలో ఎం. సాత్విక 100 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానంలో నిలిచింది.
జిల్లాస్థాయి పోటీల్లో విద్యార్థులు పతకాలు సాధించడంపై పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
🏠 Home