టీయూసీసీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా ఆలకుంట మల్లేశం ఏకగ్రీవ ఎన్నిక!
కార్మికులకు కనీస సౌకర్యాలు, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలి: ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి అందె బీరన్న
కాంట్రాక్టర్ల దోపిడీని అరికట్టడంలో కార్మిక శాఖ విఫలం.. చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్
సిద్దిపేట (హిందుస్థాన్ మీడియా):
ట్రేడ్ యూనియన్ కో-ఆర్డినేషన్ సెంటర్ (టీయూసీసీ) సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా ఆలకుంట మల్లేశం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సిద్దిపేట జిల్లా ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు బోదాసు మైసయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్మిక ప్రతినిధుల ఏకాభిప్రాయంతో ఆలకుంట మల్లేశంను టీయూసీసీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకుని నూతన బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడికి పార్టీ శ్రేణులు శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
సమావేశంలో ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అందె బీరన్న పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్రంలో కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వాలు, కాంట్రాక్టర్లు పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు. అత్యధిక శాతం మంది కార్మికులు ఎలాంటి కనీస సౌకర్యాలు లేకుండా అత్యంత ప్రమాదకర, దుర్భర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస హక్కులైన ఈఎస్ఐ (ESI), భవిష్య నిధి (PF) వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలకు కూడా నోచుకోకుండా కార్మికులను అన్యాయంగా వంచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు కార్మికులతో గొడ్డుచాకిరీ చేయించుకుంటూ, శ్రమకు తగిన వేతనాలు ఇవ్వకుండా తీవ్ర దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న కాంట్రాక్టర్లపై నిఘా ఉంచాల్సిన కార్మిక శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తక్షణమే లేబర్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి, కార్మిక చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, ప్రతీ కార్మికుడికి చట్టబద్ధమైన వేతనాలు, సౌకర్యాలు దక్కేలా చూడాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల సాధన కోసం టీయూసీసీ ఆధ్వర్యంలో పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో సిద్దిపేట నియోజకవర్గ పార్టీ కార్యదర్శి పాకాల లక్ష్మారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ అధ్యక్షుడు రేపాక రాజు, సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు వడ్ల రాజుతో పాటు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
– | హిందుస్థాన్ మీడియా |
సామాన్యుడి నేస్తం 📰