🏠 www.hindusthanmedia.com
Watermark
Newspaper Logo
www.hindusthanmedia.com | Date: 28 Oct, 2026 | Page: 1

ప్రతి కుటుంబానికి 125 రోజుల ఉపాధి కల్పన పై మేట్స్‌కు ఎంపీడీఓ సూచనలు

ప్రతి గ్రామంలో 40 మంది కూలీలతో పనులు చేపట్టాలి
>మద్దూరు, అక్టోబర్ 27, హిందుస్థాన్ మీడియా: ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పనులు కల్పించే మేట్స్‌కు మద్దూరు ఎంపీడీఓ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో మేట్‌ ఆధ్వర్యంలో 40 మంది కూలీలతో వీబీజీ రామ్ జీ పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రతి కుటుంబానికి 125 రోజుల ఉపాధి పనిదినాలు కల్పించే లక్ష్యంతో అవసరమైన చర్యలు చేపట్టాలని మేట్స్‌కు సూచించారు. కూలీలకు నిరంతరం ఉపాధి పనులు అందేలా మేట్స్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీవో వెంకటేశ్వర్లు, ఏపీవో మంజుల రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్లు రవి, రమేష్, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
🏠 Home