వంగపల్లిలో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
రైతులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం విక్రయించుకోవాలి: సర్పంచ్ కొమిరే రామస్వామి
మద్దూరు, అక్టోబర్ 29, హిందుస్థాన్ మీడియా: మద్దూరు మండలం వంగపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ కొమిరే రామస్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మారెళ్ల భాస్కర్ రెడ్డి, చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆరే వెంకట్ నారాయణ, ఏపీఎం ప్రకాశం హాజరయ్యారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రామస్వామి మాట్లాడుతూ రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి ప్రభుత్వ నిబంధనల ప్రకారం విక్రయించుకోవాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు అవసరమైన సహకారం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బొంగోని సుజాత, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చల్ల కమలాకర్ రెడ్డి, కురెల్ల యాదగిరి, ఎర్రబచ్చల భిక్షపతి, నర్సిరెడ్డి, వెంకటయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు బంజర రాములు, ఎర్రబచ్చల శ్రీకాంత్, చల్లా మధు, చాట్ల శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.