నూతన బోరు వేయాలంటే అనుమతి తప్పనిసరి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
సూపర్ ఎల్‌నినో నేపథ్యంలో తాగునీటి అవసరాలకే బోర్లు.. వ్యవసాయానికి కొత్త బోర్లు వద్దు
బోర్వెల్ యజమానులు భూగర్భ జల శాఖలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి:
రాజన్న సిరిసిల్ల జిల్లా, హిందుస్థాన్ మీడియా: జిల్లాలో నూతన బోరుబావులు వేయాలంటే వాల్టా చట్టం ప్రకారం సంబంధిత తహసీల్దార్ నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. సూపర్ ఎల్‌నినో నేపథ్యంలో భూగర్భ జలాలను సంరక్షించేందుకు తాగునీటి అవసరాలకే కొత్త బోర్లు వేయాలని, వ్యవసాయ అవసరాల కోసం నూతన బోర్లు వేయరాదని స్పష్టం చేశారు.గురువారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో భూగర్భ జల శాఖ, వ్యవసాయ శాఖ అధికారులతో పాటు బోర్వెల్ యజమానులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోర్ల ఏర్పాటుకు సంబంధించిన అనుమతులు, రిజిస్ట్రేషన్ నిబంధనలు, వాల్టా చట్టంపై అధికారులు వివరించారు.
కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలమట్టాలు తగ్గుతున్నాయని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఇతర జిల్లాలతో పోలిస్తే రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూగర్భ జలమట్టాలు తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా బోర్వెల్ యజమానులు నిబంధనలు పాటించాలని సూచించారు.జిల్లాలోని బోర్వెల్ యజమానులందరూ ఐడీఓసీలోని భూగర్భ జల శాఖ కార్యాలయంలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆదేశించారు. ప్రతి బోర్వెల్ యజమాని వారానికి ఎన్ని బోర్లు వేస్తున్నారు, వాటికి సంబంధించిన వివరాలను భూగర్భ జల శాఖ కార్యాలయానికి అందజేయాలని సూచించారు. భూగర్భ జలాలపై ఒత్తిడి తగ్గించేందుకు రైతులు నీటి వినియోగం అధికంగా ఉండే వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని కోరారు.
మండలాల వారీగా భూగర్భ జలమట్టాల వివరాలు
భూగర్భ జల శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం బోయినపల్లి మండలంలో 4.78 మీటర్లు, చందుర్తిలో 5.31, గంభీరావుపేటలో 8.39, ఇల్లంతకుంటలో 4.65, కోనరావుపేటలో 7.03, ముస్తాబాద్‌లో 8.50, రుద్రంగిలో 7.45, సిరిసిల్లలో 14.62, తంగళ్లపల్లిలో 7.80, వీర్నపల్లిలో 13.03, వేములవాడ గ్రామీణ మండలంలో 4.81, వేములవాడ పట్టణంలో 15.39, ఎల్లారెడ్డిపేటలో 10.91 మీటర్ల లోతులో భూగర్భ జలమట్టాలు ఉన్నట్లు తెలిపారు. జిల్లా సగటు భూగర్భ జలమట్టం 7.82 మీటర్లుగా ఉందని వెల్లడించారు.
సమావేశంలో భూగర్భ జల శాఖ డీడీ నాగరాజు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, కలెక్టరేట్ పర్యవేక్షకులు వైశాలి, బోర్వెల్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.