🏠 www.hindusthanmedia.com
Watermark
Newspaper Logo
www.hindusthanmedia.com | Date: 30 Oct, 2026 | Page: 1

రైతులకు 100 శాతం రాయితీపై పొద్దు తిరుగుడు విత్తనాల పంపిణీ

100 ఎకరాలకు సరిపడా కెబీఎస్‌హెచ్‌-85 రకం విత్తనాలు అందజేత
కొండపాక, అక్టోబర్ 30, హిందుస్థాన్ మీడియా: జాతీయ నూనెగింజల ఉత్పత్తి పథకం (నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్‌–ఆయిల్‌ సీడ్స్‌)లో భాగంగా కొండపాక మండల రైతులకు 100 శాతం రాయితీపై పొద్దుతిరుగుడు విత్తనాలను పంపిణీ చేశారు. శుక్రవారం దుద్దెడ రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో 100 ఎకరాలకు సరిపడా కెబీఎస్‌హెచ్‌-85 రకం విత్తనాలను రైతులకు అందజేశారు.

ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో నూనెగింజలు, పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ విత్తనాలను పూర్తి రాయితీపై అందిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి తెలిపారు. రైతులు వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి, నూనెగింజలు, పప్పుధాన్యాల పంటల సాగును పెంచాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం కిసాన్‌ పథకం 24వ విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని రైతు వేదిక నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా రైతులు వీక్షించారు.
ఈ కార్యక్రమంలో కొండపాక మండల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవోలు), రైతులు పాల్గొన్నారు.
🏠 Home