మద్దూరును కరువు మండలం గా ప్రకటించాలని మండల సభను బహిష్కరించిన సర్పంచులు
మద్దూరు, అక్టోబర్ 30, హిందుస్థాన్ మీడియా: మద్దూరు మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు శుక్రవారం మండల సభను బహిష్కరించి నిరసన తెలిపారు. సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు శనిగరం సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ మండలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ కరువు మండలంగా ప్రకటించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే మండలానికి కరువు మండలం గుర్తింపు లభించలేదని ఆరోపిస్తూ, ఇందుకు సంబంధిత అధికారులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
మండలంలోని పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు పూర్తిగా ఎండిపోయాయని, సాగునీరు అందక, విద్యుత్ సరఫరాలో అంతరాయాల కారణంగా పంటలు ఎండిపోయాయని తెలిపారు. పెట్టుబడుల కోసం అప్పులు చేసిన రైతులు పంటలు చేతికి అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రైతుల పరిస్థితిని ప్రభుత్వం గుర్తించి మద్దూరు మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించాలని కోరారు.
తమ డిమాండ్ నెరవేరే వరకు ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటామని, కరువు మండలంగా ప్రకటించే వరకు వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తామని సర్పంచులు స్పష్టం చేశారు.సమాచారం అందుకున్న ఎస్సై మహమ్మద్ ఆసిఫ్ నిరసన స్థలానికి చేరుకుని సర్పంచులతో మాట్లాడారు. ఎంపీడీవో శ్రీనివాస్ కూడా ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేయడంతో సర్పంచులు నిరసనను విరమించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు దామెర మల్లేశం, నీరటి శ్రీనివాస్, ఇట్టబోయిన కనకచంద్రం, కాసర్ల రేణుక కనకరాజు, గడిపే మౌనిక అనిల్ కుమార్, జక్కుల లింగమ్మ కనకయ్య, కర్నె సునీత మనోహర్, బీజేపీ మండల అధ్యక్షుడు మోకు ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.