కేజీబీవీలో సమస్యలకు చెక్ -15 రోజుల్లో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు :ఎమ్మెల్యే పల్లా

డ్రైనేజీ సమస్యకు తక్షణ పరిష్కారం భోజనం, వసతి, ఆరోగ్యంలో నిర్లక్ష్యం సహించేది లేదు: పల్లా రాజేశ్వర్ రెడ్డి సిద్దిపేట జిల్లా, హిందుస్థాన్ మీడియా, మద్దూరు: ఇటీవల ఫుడ్ పాయిజనింగ్ ఘటనలో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి బుధవారం మద్దూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. పాఠశాలలోని విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి, వసతులు, భోజన నాణ్యత, ఇతర సమస్యలను ఆయన స్వయంగా పరిశీలించారు. విద్యార్థినులతో నేరుగా మాట్లాడిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విద్యార్థినులతో నేరుగా మాట్లాడి పలు వివరాలు తెలుసుకున్నారు. ఏయే గ్రామాల నుంచి వచ్చి చదువుకుంటున్నారు?...