అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ

మద్దూరు, దూల్మిట్ట మండలాల్లో ఘనంగా రాఖీ పండుగ అన్నదమ్ములకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపిన అక్కాచెల్లెళ్లు సిద్దిపేట జిల్లా, హిందుస్థాన్ మీడియా, ఆగస్టు 28: మద్దూరు, దూల్మిట్ట మండల కేంద్రాలతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో శుక్రవారం రాఖీ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ములకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అన్నదమ్ములు తమ అక్కాచెల్లెళ్లకు కానుకలు అందజేస్తూ ప్రేమాభిమానాలను చాటుకున్నారు. రాఖీ పండుగ సందర్భంగా గ్రామాల్లో పండుగ సందడి నెలకొంది. కుటుంబ సభ్యులు ఒకచోట చేరి ఆనందోత్సాహాల మధ్య వేడుకలను జరుపుకున్నారు. అనుబంధాలను మరింత బలోపేతం చేసే పండుగఅన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న ప్రేమానురాగాలు, ఆత్మీయతకు రాఖీ పండుగ ప్రతీకగా...