కూరగాయల అంగడి... కుక్కల అడ్డా..|

కూరగాయలు, మాంసం దుకాణాల వద్ద వ్యాపారులు, కొనుగోలుదారులకు తీవ్ర ఇబ్బందులు ​మహిళలు, చిన్నారులపై ఎక్కడ దాడి చేస్తాయోనని భయాందోళనలు ​వ్యర్థాల తొలగింపు, పారిశుద్ధ్య నిర్వహణతో పాటు వీధికుక్కల నియంత్రణకు పంచాయతీ చర్యలు చేపట్టాలని డిమాండ్ ​మద్దూరు (హిందుస్థాన్ మీడియా): ​వారం సంతలో వీధికుక్కల బెడద ​సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో ప్రతి గురువారం నిర్వహించే కూరగాయల అంగడిలో వీధికుక్కల బెడద తీవ్రరూపం దాల్చింది. వారపు సంత జరిగే ప్రదేశంలో శునకాలు గుంపులు గుంపులుగా స్వైరవిహారం చేస్తుండటంతో అటు చిరు వ్యాపారులు, ఇటు సరుకులు కొనుగోలు చేయడానికి వచ్చే ప్రజలు తీవ్ర భయాందోళనలు ఎదుర్కొంటున్నారు. అంగడి ప్రాంగణంలోని కూరగాయల దుకాణాలు, మాంసం విక్రయించే ప్రాంతాల చుట్టూ...