ఆటో కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి : అందె బీరన్న డిమాండ్

ఉచిత బస్సు పథకంతో ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులకు నెలకు రూ.15 వేల జీవన భృతి ఇవ్వాలి ప్రతి ఆటో కార్మికుడికి ఎలక్ట్రిక్‌ ఆటో అందించాలి: ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ సిద్దిపేట, సెప్టెంబర్ 15, హిందుస్థాన్ మీడియా: ఉచిత బస్సు పథకం అమలుతో ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ తెలంగాణ కార్యదర్శి అందె బీరన్న డిమాండ్‌ చేశారు. సిద్దిపేట పట్టణ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా అందె బీరన్న మాట్లాడుతూ ఉచిత బస్సు పథకం కారణంగా ఆటో కార్మికుల ఆదాయం గణనీయంగా తగ్గిందని, కుటుంబాలను...