తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో మళ్ళీ భూ పోరాటాలు : బీవీ రాఘవులు

చేర్యాల నుంచి వీర బైరాన్‌పల్లికి భారీ బైక్‌ ర్యాలీ చేర్యాల, సెప్టెంబర్ 17, హిందుస్థాన్ మీడియా: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో భూమిలేని పేదలను సమీకరించి భూ పోరాటాలు నిర్వహించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వీర బైరాన్‌పల్లి గ్రామంలో నిర్వహించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల సంస్మరణ ముగింపు సభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యేందుకు వెళ్తూ చేర్యాల గాంధీ సెంటర్‌ నుంచి వీర బైరాన్‌పల్లి వరకు నిర్వహించిన భారీ బైక్‌ ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాఘవులు మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పేద ప్రజలను ఆత్మగౌరవంతో నిలబెట్టిన మహత్తర...