అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయులకు తప్పక గుర్తింపు ఉంటుంది : RUPPT

మండల ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం చేర్యాల, మద్దూరు మండలాల ఉత్తమ తెలుగు, హిందీ ఉపాధ్యాయులకు సత్కారం చేర్యాల, సెప్టెంబర్‌ 26, హిందుస్థాన్ మీడియా: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల చేర్యాల, మద్దూరు మండలాల్లో విద్యాశాఖ ద్వారా మండల ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన తెలుగు, హిందీ ఉపాధ్యాయులను రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్‌ తెలంగాణ (RUPPT) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. పెద్దమగడ్డ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల బాలురలో కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు వి. సురేష్‌ అధ్యక్షతన నిర్వహించిన తెలుగు కాంప్లెక్స్‌ సమావేశంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. చేర్యాల మండలం నుంచి ఎంపికైన రాసూరి శ్రీనివాస్‌, కత్తుల కనకారెడ్డి, మద్దూరు మండలం నుంచి ఎంపికైన చల్ల...