టీబీ రహిత గ్రామంగా గిరాయిపల్లి

గ్రామ ఆరోగ్య కార్యక్రమాలకు సహకరించిన సిబ్బందికి సర్పంచ్‌ కృతజ్ఞతలు కొండపాక, అక్టోబర్‌ 8, హిందుస్థాన్‌ మీడియా: సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని గిరాయిపల్లి గ్రామం టీబీ రహిత గ్రామంగా ఎంపికైంది. ఈ సందర్భంగా గురువారం సిద్దిపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ చేరుపల్లి ధనరాజు చేతుల మీదుగా గ్రామానికి టీబీ రహిత గ్రామ సర్టిఫికెట్‌ అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ సంజీవరెడ్డిని సత్కరించారు. గ్రామంలో టీబీ నియంత్రణ, గుర్తింపు, అవగాహన కార్యక్రమాల్లో భాగస్వాములైన ఆరోగ్య సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బందిని సర్పంచ్‌ అభినందించారు. గ్రామాన్ని టీబీ రహిత గ్రామంగా ఎంపిక చేయడంలో సహకరించిన ఏఎన్‌ఎం ఝాన్సీలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి స్నేహప్రియ, ఆశా...