కొంపల్లిలో సొంత ఖర్చులతో బతుకమ్మకు బంగారు బాట..!

కట్ట రహదారికి మరమ్మతులు.. పారిశుద్ధ్య పనులు మహిళలకు ఇబ్బందులు కలగకుండా సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ చొరవ మెదక్‌, అక్టోబర్‌ 10, హిందుస్థాన్‌ మీడియా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొంపల్లి గ్రామ సర్పంచ్‌ జూకంటి పాపయ్య, ఉపసర్పంచ్‌ దయ్యం శెట్టయ్య ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం కొంపల్లి గ్రామంలోని చెరువు కట్ట రహదారి అస్తవ్యస్తంగా ఉండటంతో, తమ సొంత ఖర్చులతో మరమ్మతులు, పారిశుద్ధ్య పనులు చేపట్టారు. బతుకమ్మ వేడుకలకు మహిళలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో చెరువు కట్టపై ఉన్న అడ్డంకులను తొలగించి, రహదారిపై మొరం వేయించి రాకపోకలకు...