నర్మెటలో సమాచార హక్కు చట్టం ఆవిర్భావ దినోత్సవం

ఆర్టీఐపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి: కట్ట ఎల్లయ్య సిద్దిపేట జిల్లా, నంగునూరు, అక్టోబర్‌ 12, హిందుస్థాన్‌ మీడియా: సమాచార హక్కు చట్టం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నంగునూరు మండలం నర్మేట గ్రామంలో సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కమిటీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి కట్ట ఎల్లయ్య నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్టీఐ చట్టం ప్రాధాన్యాన్ని వివరించారు.ఈ సందర్భంగా కట్ట ఎల్లయ్య మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో పౌరులకు సమాచార హక్కు చట్టం కీలకమైన సాధనమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంతో పాటు అవినీతిని అరికట్టేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజలు చట్టంపై అవగాహన పెంచుకుని,...