చేర్యాలలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు.!
వరకు సాగిన ఆడపడుచుల ఆటపాటలు! రంగురంగుల పూల బతుకమ్మలతో వెల్లివిరిసిన పండుగ శోభ.. మహిళల ఐక్యతకు ప్రతీక ఏర్పాట్లను పర్యవేక్షించిన మున్సిపల్ కమిషనర్ అభిలాష్, ఎస్సై అపూర్వ రెడ్డి ప్రశాంత వాతావరణంలో ముగిసిన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల మహోత్సవం అక్కడక్కడ విద్యుత్ దీపాల కొరతపై ప్రజల్లో కొంత అసంతృప్తి..! చేర్యాల (హిందుస్థాన్ మీడియా): సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో సద్దుల బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరిగాయి. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతితో మమేకమైన జీవన సంస్కృతికి అద్దంపట్టే ఈ ఉత్సవాల్లో మహిళలు, యువతులు సరికొత్త ఉత్సాహంతో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తీరొక్క పూలతో అందంగా తీర్చిదిద్దిన బతుకమ్మలను ప్రధాన కూడళ్లలో...