శ్రీరామ్ ఫైనాన్స్ లో భారీ మోసం.లోన్ తీసుకోకున్నా.. 20 లక్షల రుణం..!ఖాతాదారుడి లబోదిబో!..

చేర్యాల బ్రాంచ్‌లో వెలుగుచూసిన ఫైనాన్స్ సంస్థ నిర్వాకం.. బాధితుడు చంద శ్రీకాంత్ ఆవేదన ​సిబిల్ స్కోర్ పతనమై బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి.. ప్రశ్నిస్తే మేనేజర్, డీఎంల నిర్లక్ష్యపు సమాధానాలు ​ఇలాంటి ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల అనుమతులు రద్దు చేసి క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ ​చేర్యాల (హిందుస్థాన్ మీడియా): సాధారణ ప్రజలను, అమాయకులను లక్ష్యంగా చేసుకుని ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు చేస్తున్న మోసాలు చేర్యాల పట్టణంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. చేర్యాల పట్టణ కేంద్రంలోని శ్రీరామ్ చిట్ ఫండ్స్ / ఫైనాన్స్ కంపెనీలో ఒక వ్యక్తి పేరుపై ఆయనకు ఏమాత్రం తెలియకుండానే ఏకంగా రూ. 20 లక్షల మేర భారీ బిజినెస్ లోన్ సృష్టించిన...