దసరా వేడుకల్లో పాల్గొన్న డిసిసి ఉపాధ్యక్షులు ఎల్లా శ్రీనివాస్ రెడ్డి
కొండంరాజుపల్లి, నాగరాజుపల్లి గ్రామాల్లో భక్తిశ్రద్ధలతో విజయదశమి ఉత్సవాలు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా: డీసీసీ ఉపాధ్యక్షులు ఎల్లా శ్రీనివాస్ రెడ్డి గ్రామ ప్రజలకు, కాంగ్రెస్ శ్రేణులకు విజయదశమి శుభాకాంక్షలు నంగునూరు / సిద్దిపేట (హిందుస్థాన్ మీడియా): సిద్దిపేట జిల్లావ్యాప్తంగా దసరా (విజయదశమి) పండుగ సంబరాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో కొనసాగాయి. నంగునూరు మండల పరిధిలోని కొండంరాజుపల్లి, నాగరాజుపల్లి గ్రామాల్లో స్థానిక ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించిన దసరా వేడుకల్లో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) ఉపాధ్యక్షులు ఎల్లా శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని జమ్మి వృక్షం వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజలు, శమీ పూజ కార్యక్రమాల్లో...