విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యం : స్వామి TG UEEU -CITU యూనియన్ లో చేరికలు
చేర్యాల వాసవి గార్డెన్స్‌లో ఘనంగా సమావేశం.. కండువాలు కప్పి ఆహ్వానించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలవాల స్వామి విద్యుత్ రంగ ప్రైవేటీకరణ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ 2026 పీఆర్సీని అమలు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక చేర్యాల (హిందుస్థాన్ మీడియా): తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (TG UEEU–CITU) ఆధ్వర్యంలో సాగుతున్న కార్మిక ఉద్యమాలు, సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న నిరంతర పోరాటాలకు ఆకర్షితులై విద్యుత్ కార్మికులు భారీ సంఖ్యలో యూనియన్‌లో చేరారు. చేర్యాల, హుస్నాబాద్ డివిజన్లకు చెందిన పలువురు విద్యుత్ ఉద్యోగులు ఆదివారం చేర్యాల మండల కేంద్రంలోని వాసవి గార్డెన్స్‌లో నిర్వహించిన సమావేశంలో యూనియన్ సభ్యత్వం తీసుకున్నారు. లైన్మెన్ (LM),...