ఎండీ కమ్యూనిటీ మెడిసిన్ లో డాక్టర్ ప్రీతికి నాలుగో ర్యాంక్

మహారాష్ట్ర యూనివర్సిటీ ఫలితాల్లో ప్రతిభ చాటిన చేర్యాల బిడ్డ చేర్యాల, అక్టోబర్ 26, హిందుస్థాన్ మీడియా: చేర్యాల పట్టణానికి చెందిన పోగుల ప్రీతి ఎండీ కమ్యూనిటీ మెడిసిన్ పరీక్షల్లో విశ్వవిద్యాలయ స్థాయిలో నాలుగో ర్యాంక్ సాధించి ప్రతిభ చాటారు. నాగ్‌పూర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో చదువుకున్న ఆమె మహారాష్ట్ర యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (ఎంయూహెచ్‌ఎస్‌) విడుదల చేసిన ఫలితాల్లో ఈ ఘనత సాధించడం విశేషం. కర్రోల్ల ఎలీషా మనుమరాలైన ప్రీతి సాధించిన ఈ విజయం కుటుంబ సభ్యులు, పరిచయస్తుల్లో ఆనందాన్ని నింపింది. ఈ సందర్భంగా డాక్టర్ ప్రీతి మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన విభాగాధిపతి, గైడ్‌, నాగ్‌పూర్ ప్రభుత్వ వైద్య కళాశాల అధ్యాపకులు, సీనియర్లు,...