పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వ్యాస రచన పోటీలు
సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల (డ్రగ్స్) దుష్ప్రభావాలపై విద్యార్థుల్లో చైతన్యం ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ కనబరిచిన పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు నేర రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థులే కీలక భాగస్వాములు: చేర్యాల పోలీస్ శాఖ చేర్యాల (హిందుస్థాన్ మీడియా): పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే) వారోత్సవాలను పురస్కరించుకుని చేర్యాల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రగతి విద్యానికేతన్ పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. సమాజంలో రోజురోజుకూ పెరుగుతున్న సరికొత్త సవాళ్లు, సమకాలీన సామాజిక రుగ్మతలను దృష్టిలో ఉంచుకుని "సైబర్ నేరాలు - తీసుకోవాల్సిన జాగ్రత్తలు" మరియు "మాదకద్రవ్యాల (డ్రగ్స్) వినియోగం - యువతపై వాటి దుష్ప్రభావాలు" తదితర కీలక అంశాలపై ఈ...