టీయూసీసీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా ఆలకుంట మల్లేశం ఏకగ్రీవ ఎన్నిక!
కార్మికులకు కనీస సౌకర్యాలు, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలి: ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి అందె బీరన్న కాంట్రాక్టర్ల దోపిడీని అరికట్టడంలో కార్మిక శాఖ విఫలం.. చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ సిద్దిపేట (హిందుస్థాన్ మీడియా): ట్రేడ్ యూనియన్ కో-ఆర్డినేషన్ సెంటర్ (టీయూసీసీ) సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా ఆలకుంట మల్లేశం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సిద్దిపేట జిల్లా ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు బోదాసు మైసయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్మిక ప్రతినిధుల ఏకాభిప్రాయంతో ఆలకుంట మల్లేశంను టీయూసీసీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకుని నూతన బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా నూతన...