చేర్యాలలో ఘనంగా జాతీయ మాల మహానాడు 20వ ఆవిర్భావ దినోత్సవం

అంబేద్కర్‌ ఆశయాలు, రాజ్యాంగ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం: బుట్టి సత్యనారాయణ చేర్యాల, హిందుస్థాన్ మీడియా: సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో జాతీయ మాల మహానాడు 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి, సంఘం జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంతో పాటు తెలంగాణ ఉద్యమం, పలు సామాజిక ఉద్యమాల్లో జాతీయ మాల మహానాడు కీలకంగా పనిచేసిందని పేర్కొన్నారు. అంబేద్కర్‌, మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రాజ్యాంగ...