వంగపల్లిలో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
రైతులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం విక్రయించుకోవాలి: సర్పంచ్ కొమిరే రామస్వామి మద్దూరు, అక్టోబర్ 29, హిందుస్థాన్ మీడియా: మద్దూరు మండలం వంగపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ కొమిరే రామస్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మారెళ్ల భాస్కర్ రెడ్డి, చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆరే వెంకట్ నారాయణ, ఏపీఎం ప్రకాశం హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ రామస్వామి మాట్లాడుతూ రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి ప్రభుత్వ నిబంధనల ప్రకారం విక్రయించుకోవాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు...