బాలికలకు పోక్సో చట్టంపై అవగాహన కల్పించిన చేర్యాల జడ్జి బానోత్ శ్రీరామ్
బాలల రక్షణపై అవగాహన పెంచుకోవాలి.. నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు చేర్యాల, హిందుస్థాన్ మీడియా: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ‘సురక్షిత్ బచ్పన్ అభియాన్’ అవగాహన కార్యక్రమంలో భాగంగా చేర్యాల కోర్టు పరిధిలోని కస్తూరిబా బాలికల కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక న్యాయమూర్తి బానోత్ శ్రీరామ్ పాల్గొని బాలికలకు పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ బాలలపై లైంగిక నేరాలను నిరోధించేందుకు పోక్సో చట్టం అమలులో ఉందని, ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాలికలు తమ భద్రతపై అవగాహన కలిగి ఉండాలని, ఏదైనా వేధింపులు ఎదురైతే భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా...