జీఎంపీవీఎస్‌ సిద్దిపేట జనగామ జిల్లాల ఇంచార్జిగా అందె అశోక్

గొల్ల, కురుమల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : అందె అశోక్ చేర్యాల, హిందుస్థాన్ మీడియా: గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం (జీఎంపీవీఎస్‌) సిద్దిపేట, జనగామ జిల్లాల ఇంచార్జిగా చేర్యాల మండలం ఆకునూరు గ్రామానికి చెందిన అందె అశోక్‌ నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని రాజ్‌ బహదూర్‌ గౌర్‌ విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు గొల్ల, కురుమలకు గొర్రెలు, మేకల పెంపకం కోసం 75 శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేయాలని, అడవుల్లో పశువులను మేపుకునేందుకు హక్కులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రమాదవశాత్తు మరణించిన పశువులకు నష్టపరిహారం చెల్లించాలని, ఎలాంటి షరతులు లేకుండా రూ.10 లక్షల...