రోడ్డు ప్రమాద బాధితులు పీఎం రహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రహత్ పథకం భరోసా జిల్లాలోని 7 ఆసుపత్రుల్లో రూ.1.5 లక్షల వరకు నగదు రహిత వైద్యం రాజన్న సిరిసిల్ల జిల్లా, హిందుస్థాన్ మీడియా: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు సకాలంలో వైద్య చికిత్స అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం రహత్ (PM RAHAT) పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. ఈ పథకం కింద రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఏడు ఆసుపత్రుల్లో అర్హత నిబంధనలకు అనుగుణంగా గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు, ఏడు రోజుల పాటు నగదు రహిత వైద్య చికిత్స పొందవచ్చని తెలిపారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే...