నీటి సంరక్షణతోనే కరువును ఎదుర్కోగలం : సర్పంచ్ కనక చంద్రం

గాగిల్లాపూర్‌లో సాంస్కృతిక సారథి కళాబృందం అవగాహన కార్యక్రమం మద్దూరు, అక్టోబర్ 29, హిందుస్థాన్ మీడియా: ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో ప్రజలు నీటి వనరులను సంరక్షించుకోవాలని తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం సభ్యులు సూచించారు. జిల్లా కలెక్టర్‌, జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ అధికారి బిజ్జురి రవికుమార్‌, తెలంగాణ సాంస్కృతిక సారథి ఆదేశాల మేరకు గురువారం మద్దూరు మండలం గాగిల్లాపూర్‌లో కళాజాత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆటపాటలు, నాటికల ద్వారా నీటి సంరక్షణ, కరువు నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్‌ ఇట్టబోయిన కనకచంద్రం మాట్లాడుతూ, భూగర్భ జలాలు అడుగంటకుండా ప్రతి నీటి చుక్కను...