నూతన బోరు వేయాలంటే అనుమతి తప్పనిసరి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
సూపర్ ఎల్‌నినో నేపథ్యంలో తాగునీటి అవసరాలకే బోర్లు.. వ్యవసాయానికి కొత్త బోర్లు వద్దు బోర్‌వెల్ యజమానులు భూగర్భ జల శాఖలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: రాజన్న సిరిసిల్ల జిల్లా, హిందుస్థాన్ మీడియా: జిల్లాలో నూతన బోరుబావులు వేయాలంటే వాల్టా చట్టం ప్రకారం సంబంధిత తహసీల్దార్ నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. సూపర్ ఎల్‌నినో నేపథ్యంలో భూగర్భ జలాలను సంరక్షించేందుకు తాగునీటి అవసరాలకే కొత్త బోర్లు వేయాలని, వ్యవసాయ అవసరాల కోసం నూతన బోర్లు వేయరాదని స్పష్టం చేశారు.గురువారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో భూగర్భ జల శాఖ, వ్యవసాయ శాఖ అధికారులతో పాటు బోర్‌వెల్ యజమానులతో కలెక్టర్ సమీక్ష...