చేర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
ప్రోగ్రామ్ 6.0 లో భాగంగా శానిటేషన్ డ్రైవ్.. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు ఉత్తమ సేవలందించిన ఐదుగురు పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం హాజరైన మున్సిపల్ అధికారులు, మహిళా శిశు సంక్షేమ శాఖ బృందం, కౌన్సిలర్లు చేర్యాల (హిందుస్థాన్ మీడియా): కేంద్ర ప్రభుత్వ మహిళా, శిశు సంక్షేమ శాఖ సూచనల మేరకు, సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ముమ్మర పారిశుద్ధ్య పనులు చేపట్టారు. 'ప్రోగ్రామ్ 6.0' లో భాగంగా మున్సిపల్ శానిటేషన్ సిబ్బందితో కార్యాలయ పరిసరాలను శుభ్రం చేయించి, పిచ్చి మొక్కలను తొలగించి బ్లీచింగ్ పౌడర్ పిచికారీ చేయించారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు...