మద్దూరును కరువు మండలం గా ప్రకటించాలని మండల సభను బహిష్కరించిన సర్పంచులు
మద్దూరు, అక్టోబర్ 30, హిందుస్థాన్ మీడియా: మద్దూరు మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు శుక్రవారం మండల సభను బహిష్కరించి నిరసన తెలిపారు. సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు శనిగరం సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ మండలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ కరువు మండలంగా ప్రకటించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే మండలానికి కరువు మండలం గుర్తింపు లభించలేదని ఆరోపిస్తూ, ఇందుకు సంబంధిత అధికారులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు పూర్తిగా...