EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • విధి నిర్వహణలో అప్రమత్తతకు సీపీ ప్రశంసలు

    Author THADEM PRASHANTH | 18 Jul 2026, 09:21 PM | TELANGANA
    విధి నిర్వహణలో అప్రమత్తతకు సీపీ ప్రశంసలు

    చేర్యాల, హిందుస్థాన్ మీడియా: విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించి ఇద్దరు విద్యార్థులను సురక్షితంగా హాస్టల్‌కు చేర్చిన చేర్యాల పోలీస్ స్టేషన్ బ్లూ కోల్ట్స్ సిబ్బంది రవి, వెంకటేష్ లను సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ అభినందించి ప్రశంసాపత్రంతో పాటు రివార్డు ప్రదానం చేశారు.
    ఈ నెల 11వ తేదీ తెల్లవారుజామున 4 గంటల సమయంలో ముస్త్యాల బస్టాండ్ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఇద్దరు బాలురు అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని గమనించిన బ్లూ కోల్ట్స్ సిబ్బంది వారిని విచారించారు. తొలుత వాకింగ్‌కు వచ్చామని చెప్పిన బాలురు, అనంతరం ముస్త్యాల ప్రగతి విద్యానికేతన్‌లో 8వ తరగతి చదువుతున్నామని, హాస్టల్‌లో ఉండడం ఇష్టం లేక బయటకు వచ్చామని తెలిపారు.దీంతో వెంటనే వారిని హాస్టల్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ నిర్వహించి వార్డెన్‌కు అప్పగించారు. విధి పట్ల అప్రమత్తత, బాధ్యతాయుతంగా వ్యవహరించినందుకు సీపీ రష్మీ పెరుమాళ్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రశంసాపత్రం, రివార్డు అందజేశారు.

    విధి నిర్వహణలో అప్రమత్తతకు సీపీ ప్రశంసలు  - Additional Image