EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పెద్ద అంబర్‌పేట్‌లో ఘనంగా బోనాల పండుగ, షెడ్ ఏర్పాటు చేసిన శ్రీనివాస్ గౌడ్

    Author THADEM PRASHANTH | 24 Aug 2026, 01:47 PM | Array
    పెద్ద అంబర్‌పేట్‌లో ఘనంగా బోనాల పండుగ, షెడ్ ఏర్పాటు చేసిన  శ్రీనివాస్ గౌడ్

    మంజీరా కాలనీ, జయప్రకాష్ నగర్‌లో భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాల సమర్పణ
    భక్తుల సౌకర్యార్థం రూ.లక్షతో షెడ్ ఏర్పాటు చేసిన గ్యారాల శ్రీనివాస్ గౌడ్
    పెద్ద అంబర్‌పేట్, హిందుస్థాన్ మీడియా: పెద్ద అంబర్‌పేట్ పరిధిలోని మంజీరా కాలనీ, జయప్రకాష్ నగర్ కాలనీలలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. జయప్రకాష్ నగర్ కాలనీలోని బంగారు పోచమ్మ ఆలయంలో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆటపాటలు, భక్తి కార్యక్రమాలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.
    ఈ సందర్భంగా జీఎస్ సేవా సమితి చైర్మన్, మాజీ కౌన్సిలర్ గ్యారాల శ్రీనివాస్ గౌడ్ భక్తుల సౌకర్యార్థం తనవంతు సహకారంగా రూ.లక్ష వ్యయంతో ఆలయ ప్రాంగణంలో షెడ్‌ను ఏర్పాటు చేయించారు. బోనాల పండుగ సందర్భంగా భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ముందుకు వచ్చిన శ్రీనివాస్ గౌడ్‌ను పలువురు అభినందించారు.
    అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండుగ సందర్భంగా కాలనీల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
    ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గ్యారాల శ్రీనివాస్ గౌడ్, చామ విజయ శేఖర్ రెడ్డి, రామ్ రెడ్డి, సుర్వి సురేష్, జయప్రకాష్ నగర్ కాలనీ అధ్యక్షుడు సుధాకర్, మంజీరా కాలనీ అధ్యక్షుడు ఉయ్యాల రమేష్, శేఖరాచారి తదితరులు పాల్గొన్నారు.

    పెద్ద అంబర్‌పేట్‌లో ఘనంగా బోనాల పండుగ, షెడ్ ఏర్పాటు చేసిన  శ్రీనివాస్ గౌడ్ - Additional Image