EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్ట్... రిమాండ్

    Author R K SRINIVAS | 23 Oct 2026, 09:49 AM | Array
    హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్ట్... రిమాండ్

    మద్దూరు, అక్టోబర్‌ 22, హిందుస్థాన్‌ మీడియా: దసరా పండుగ రోజు రాత్రి జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి నాయిని మధును పోలీసులు అరెస్ట్‌ చేశారు. కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించినట్లు మద్దూరు ఎస్‌ఐ ఆసిఫ్‌ తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దసరా రోజు రాత్రి సుమారు 11 గంటల సమయంలో నాయిని మధు తన తండ్రి శంకరయ్యను కొడుతుండగా, అడ్డుకునేందుకు నాయిని రాకేష్‌ ప్రయత్నించాడు. ఈ క్రమంలో మధు కత్తితో రాకేష్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించగా, అడ్డుకునే క్రమంలో రాచకొండ ఉమేష్‌ చేతికి గాయమైంది.ఈ ఘటనపై ఉమేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నాయిని మధును అరెస్ట్‌ చేసి చేర్యాల కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం రిమాండ్‌ విధించడంతో నిందితుడిని సిద్దిపేట జిల్లా జైలుకు తరలించినట్లు ఎస్‌ఐ ఆసిఫ్‌ వెల్లడించారు.