EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి నుంచి తొలగించాలి :సిపిఎం డిమాండ్

    Author R K SRINIVAS | 23 Oct 2026, 06:55 PM | TELANGANA
    కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి నుంచి తొలగించాలి :సిపిఎం డిమాండ్

    మద్దూరులో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దహనం.. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్
    మద్దూరు, అక్టోబర్ 23, హిందుస్థాన్ మీడియా: కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఆలేటి యాదగిరి డిమాండ్ చేశారు. శుక్రవారం మద్దూరు మండల కేంద్రంలో సీఐటీయూ, రైతు సంఘం, గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం, ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

    ఈ సందర్భంగా ఆలేటి యాదగిరి మాట్లాడుతూ.. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ పేరుతో ప్రతిపక్ష నాయకులు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి ఓట్లను పెద్ద ఎత్తున తొలగిస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రక్రియ ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగిస్తోందని పేర్కొంటూ, వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఓట్ల తొలగింపునకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, జ్ఞానేష్ కుమార్‌ను అరెస్టు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ ఎండీ షఫీ, రైతు సంఘం మండల కార్యదర్శి బెజాడి మల్లారెడ్డి, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వేల్పుల విజయ్ కుమార్, నాయకులు పిట్టల నరేష్, మల్లేశం, మురళి, స్థాయిలు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.