EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఎల్‌నినో ప్రభావం పై అవగాహన కల్పించిన సాంస్కృతిక సారథి కళాజాత!

    Author THADEM PRASHANTH | 24 Oct 2026, 04:33 PM | TELANGANA
    ఎల్‌నినో ప్రభావం పై అవగాహన కల్పించిన సాంస్కృతిక సారథి కళాజాత!

    నీటి పొదుపు, ఇంకుడు గుంతల నిర్మాణం, పశుగ్రాసం నిల్వపై అవగాహన
    మద్దూరు, అక్టోబర్ 24, హిందుస్థాన్ మీడియా: ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం మద్దూరు మండలం లద్నూరు గ్రామంలో ఆటపాటలు, నాటికల ద్వారా అవగాహన కల్పించింది. జిల్లా కలెక్టర్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ డాక్టర్ జి.వి. వెన్నెలక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ కాసర్ల రేణుక కనకరాజు మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం, కరువు పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి నీటి చుక్కను పొదుపు చేయాలని, నీటిని వృథా చేయకుండా ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. పశువులకు అవసరమైన పశుగ్రాసాన్ని ముందుగానే సమకూర్చుకోవాలని, మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులతో పాటు తెలంగాణ సాంస్కృతిక సారథి గజ్వేల్ బృందం నాయకుడు పిల్లిట్ల శ్యామ్, పుల్లూరు యాదగిరి, పిన్నింటి రత్నం, దూల్మిట్ట గెంటే హరిప్రసాద్, సనువాల కనకయ్య, పన్నీరు శ్రీనివాస్, ఎల్ల సిద్దులు, డప్పు తండ బిక్షపతి, బండారు నర్సయ్య, పద్మ, శైలజ, మమత తదితరులు పాల్గొన్నారు.